Site icon NTV Telugu

Venu Swamy: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. వేణు స్వామి సంచలన నిర్ణయం!

Astrologer Venu Swamy

Astrologer Venu Swamy

Venu Swamy took a sensational decision after YCP Defeat: సినీ సెలబ్రిటీలే కాకుండా రాజకీయ ప్రముఖుల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి ఏ రాజకీయ ప్రిడిక్షన్స్ కానీ, సినిమా పరిశ్రమకు చెందిన వారి ప్రిడిక్షన్స్ కానీ సోషల్ మీడియాలో చెప్పను అని తెలిపాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నా అని వేణు స్వామి పేర్కొన్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తన ప్రిడిక్షన్ తప్పయిందని ఒప్పుకున్నాడు.

ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి విజయం ఖాయం అయిన నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘దేశంలో లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై నేను ప్రిడిక్షన్స్ చెప్పాను. నేను చెప్పినట్లే నరేంద్ర మోడీ ప్రభావం తగ్గింది. ఏపీలో మాత్రం వైఎస్ జగన్ ఓడిపోయారు. నా ప్రిడిక్షన్ ఒకటి తప్పయింది. జాతకాలను బట్టే నేను ప్రిడిక్షన్ చెబుతా. నన్ను చాలా రోజుల నుంచి కొందరు టార్గెట్ చేశారు. జగన్ గారి విషయంలో నా ప్రిడిక్షన్ తప్పింది. కాబట్టి ఇకపై సోషల్ మీడియాలో ఎవరి జాతకాలను విశ్లేషించను’ అని వేణు స్వామి చెప్పాడు.

Exit mobile version