Site icon NTV Telugu

Asteroids : భూమిపైకి ఆస్టరాయిడ్ల దండయాత్ర.. ఏ క్షణమైనా..

Asteroids

Asteroids

ఈ అనంత విశ్వంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. అయితే.. అతరిక్షం అప్పుడుప్పుడు అద్భుతాలు జరగడం చూస్తూనే ఉంటాం. మండుతున్న వస్తువులు భూవాతావరణంలోకి రావడం ఈ మధ్య టీవీల్లో వీక్షిస్తున్నాం. కొన్ని రోజుల క్రితం ఓ ఖగోళ వస్తువు మండుతూ మహారాష్ట్రలో కిందపడింది. ఇలా ఉల్కలు భూమిని ఢీకొట్టడం వల్ల జరిగిన విధ్వంసానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. అయితే.. తాజాగా అంతరిక్షంలో తిరుగాడుతున్న ఆస్టరాయిడ్లలో భూమికి కనీసం 75 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి దూసుకెళ్లే అవకాశమున్న వాటిపై నిత్యం నిఘా పెట్టి ఉంచుతుంది నాసా. అందులోనూ 150 మీటర్లకన్నా పెద్ద పరిమాణంలో ఉండేవాటిని అత్యంత ప్రమాదకర ఆస్టరాయిడ్ల జాబితాలో చేర్చి ప్రత్యేకంగా నిఘా పెడుతుంది నాసా. నిజానికి లక్షల కిలోమీటర్ల దూరం అంటే ఎక్కువే అయినా.. భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనై వచ్చి ఢీకొనే అవకాశాలూ ఉంటాయని తెలిపారు నాసా శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లనూ గుర్తించి నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు నాసా శాస్త్రవేత్తలు.

 

శుక్రవారం (ఆగస్టు 12న) ‘2015 ఎఫ్ఎఫ్’గా పిలిచే ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా వెళ్లనుంది. 53 అడుగుల (సుమారు 16 మీటర్లు) వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ తో పెద్దగా ప్రమాదం లేదని తెలిపిన నాసా.. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 14న (ఆదివారం) తెల్లవారుజామున 3.23 గంటల సమయంలో ‘2022 ఓటీ1’గా పిలిచే ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా వెళ్లనుందని పేర్కొంది. 110 అడుగుల (సుమారు 34 మీటర్లు) పరిమాణమున్న ఈ గ్రహ శకలం భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఏకంగా గంటకు 20,520 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని వెల్లడించింది నాసా. ఇంత పరిమాణం, ఇంత వేగం ఉన్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొడితే కొన్ని వందల చదరపు కిలోమీటర్ల మేర విధ్వంసం తప్పదని నాసా పేర్కొంది. అయితే.. ఆగస్టు 14న మధ్యాహ్నం 71 అడుగుల (సుమారు 22 మీటర్లు) పరిమాణం ఉన్న ‘2022 ఓఏ4’ ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా దూసుకుపోనుందని.. అలాగే.. ఆగస్టు 16న 93 అడుగుల (29 మీటర్లు) వెడల్పున్న ‘2022 పీడబ్ల్యూ’ ఆస్టరాయిడ్ భూమికి పక్కగా ప్రయాణించనుందని ప్రకటించారు నాసా శాస్త్రవేత్తలు. అయితే.. భూమిపైకి ఆస్టరాయిడ్ల దండయాత్రలో ప్రస్తుత నివేదిక ప్రకారం ఎలాంటి ప్రమాదం లేదని నాసా పేర్కొంది.

 

Exit mobile version