Site icon NTV Telugu

Begumpet: దారుణం.. మహిళా పైలట్‌పై మరో పైలట్ అత్యాచారం..

Student Raped

Student Raped

Begumpet: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా అసిస్టెంట్ పైలట్‌పై మరో పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రెండు రోజుల క్రితం బాధితురాలు బేగంపేట్ పోలీసులు ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుంచి పుట్టపర్తి చెన్నై మీదుగా బెంగళూరు వెళ్ళింది బాధితురాలు.. సాయంత్రం 4.20 నిమిషాలకు బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది. అనంతరం బెంగళూరులోని హోటల్లో మహిళా అసిస్టెంట్ పైలెట్‌తో పాటు మరో ఇద్దరు పైలెట్లు (male) బస చేశారు. అనంతరం ఇద్దరు పైలట్లతో కలిసి బాధితురాలు బయటికి వచ్చింది. తిరిగి హోటల్ రూమ్‌కి వెళ్లిన తర్వాత సదరు పైలెట్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బేగంపేట్ పోలీసులు జీరో ఎఫ్.ఐ.ఆర్ కింద కేసు నమోదు చేశారు. కేసును తిరిగి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు.

READ MORE: RGV – Imaddi Ravi : రాబిన్ హుడ్ రవి – పైరసీని హీరోయిజం చేస్తున్న ట్రెండ్‌పై ఆర్జీవీ కౌంటర్

Exit mobile version