NTV Telugu Site icon

Pakistan: పాక్ అధ్యక్షుడిగా మరోసారి జర్దారీ ఎన్నిక

Oj

Oj

పాక్ అధ్యక్షుడిగా ( Pakistan President) మరోసారి అసీఫ్ అలీ జర్దారీ (Asif ali zardari) ఎన్నికయ్యారు. మొదటి నుంచి అధ్యక్ష పదవి రేసులో ఆయన పేరే ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు అధికారికంగా ఆ పేరునే ప్రకటించారు. పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీకి 255 ఓట్లు రాగా.. అతని ప్రత్యర్థికి  119 ఓట్లే వచ్చాయి. దీంతో పాకిస్థాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. 68 ఏళ్ల జర్దారీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) మరియు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఉమ్మడి అభ్యర్థి కాగా, అతని ప్రత్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75) సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) అభ్యర్థిగా ఉన్నారు.

రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. జాతీయ అసెంబ్లీ మరియు నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎలక్టోరల్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన జర్దారీ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి పౌరుడు కూడా ఆయనే. ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Show comments