Site icon NTV Telugu

PAK vs SA: 38 ఏళ్ల వయసులో అరంగేట్రం.. 6 వికెట్లతో 92 ఏళ్ల రికార్డు బద్దలు!

Asif Afridi Record

Asif Afridi Record

పాకిస్థాన్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అఫ్రిది ఐదు వికెట్స్ పడగొట్టి ఈ ఘటన అందుకున్నాడు. 38 సంవత్సరాల 301 రోజుల వయసున్న ఆసిఫ్.. అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా 92 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఇంగ్లండ్‌కు బౌలర్ ఛార్లెస్‌ మారియట్‌ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై మారియట్‌ 37 ఏళ్ల 332 రోజుల వయసులో 5 వికెట్స్ పడగొట్టాడు.

1933 ఆగస్టు 12న ది ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చార్లెస్ మారియట్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 11.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనే కాదు రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 29.2 ఓవర్లలో 59 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద బౌలర్‌గా నిలిచాడు. తాజాగా ఆ రికార్డును ఆసిఫ్ అఫ్రిది బద్దలు కొట్టాడు. హసన్‌ అలీ స్థానంలో అఫ్రిది జట్టులోకి వచ్చాడు. అంచనాలకు మించి రాణించిన అతడు.. ట్రిస్టన్‌ స్టబ్స్‌, టోనీ డిజోర్జి, డెవాల్డ్‌ బ్రెవిస్‌, కాగిసో రబాడ లాంటి కీలక వికెట్లు తీశాడు.

Also Read: Hussey-Sachin: సచిన్ కంటే 5 వేల రన్స్ ఎక్కువే చేసేవాడిని.. ఆస్ట్రేలియా దిగ్గజం షాకింగ్ కామెంట్స్!

రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (87), షఫీక్ (57), సౌద్ షకీల్ (66) హాఫ్ సెంచరీలు చేశారు. కేశవ్‌ మహారాజ్‌ 7 వికెట్స్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 404 రన్స్ చేసింది. సెనురన్‌ ముత్తుసామి (89 నాటౌట్‌), రబాడ (71), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (76), టోనీ డి జోర్జి (55) అర్ద శతకాలు బాదారు. పాక్‌ బౌలర్ ఆసిఫ్‌ అఫ్రిది 6 వికెట్స్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 16 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది.

 

Exit mobile version