Asian Youth Games 2025: ఆసియా కప్ క్రికెట్, మహిళల ప్రపంచ కప్ తర్వాత మరో క్రీడా పోటీలోనూ భారత క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. మూడవ ఏషియన్ యూత్ గేమ్స్‌లో (Asian Youth Games) భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత యువ జట్టు పాకిస్తాన్ టీమ్‌ను 81-26 తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ పాకిస్తాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. పాకిస్తాన్ కెప్టెన్ చేయి అందించినా, రాఠీ తిరస్కరించడం గమనార్హం.
ఏషియన్ యూత్ గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. పాకిస్తాన్‌ను ఓడించడానికి ముందు, ఈ జట్టు బంగ్లాదేశ్‌ను 83-19 తేడాతో, శ్రీలంకను 89-16 తేడాతో చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్‌లో భారత యువ కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, దానికి భారత్ ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం క్రీడా రంగంపై కూడా పడింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల క్రీడాకారులు ఎవరూ ఒకరికొకరు చేతులు కలపలేదు. ఆసియా కప్‌లో ఫైనల్‌తో సహా రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఈ మూడింటిలోనూ భారత జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత, భారత జట్టు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకోవడానికి నిరాకరించింది.
Neeraj Chopra: గోల్డెన్ బాయ్‌కు అరుదైన గౌరవం.. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా..!
సూర్యకుమార్ యాదవ్ ప్రారంభించిన ఈ ‘నో-హ్యాండ్‌షేక్’ ట్రెండ్‌ను భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ముందుకు తీసుకెళ్లారు. పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఆమె టాస్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయలేదు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్లు చేతులు కలపలేదు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ బాటలో భారత యువ కబడ్డీ జట్టు కెప్టెన్ ఇషాంత్ రాఠీ కూడా నడిచారు.
🚨 BIG! Team India REFUSES to shake hands with Pakistan before the toss at the Asian Youth Games 2025.
Later, India CRUSHED Pakistan 81–26 in a one-sided Kabaddi match 🔥 pic.twitter.com/vrGGr52rOC
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 21, 2025
