Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్‌లో ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఎప్పటిలాగే టైటిల్ ఫేవరెట్‌గా టీమ్ ఇండియాపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు ఎంపిక కూడా అయ్యింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా, గిల్ వైస్ కెప్టెన్ గా మొత్తం 15 మంది సభ్యులను బీసీసీఐ ప్రకటించ్చింది. చివరిసారి ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఉన్న ఆటగాళ్లతో పోలిస్తే ఈసారి కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. ఆటగాళ్ల జాబితాలోని మార్పులతో పాటు ఈసారి జట్టుకు సంబంధించిన మరో ప్రధాన తేడా జెర్సీలో కనిపించవచ్చు. గత సారి జెర్సీపై కనిపించిన టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ 11 లోగో ఈసారి ఉండకపోవచ్చని సమాచారం.
భారత జట్టు సెప్టెంబర్ 10న UAEతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆటగాళ్లందరూ నీలిరంగు టీ20 జెర్సీలో మైదానంలోకి దిగనున్నారు. ఈ జెర్సీపై భారత్ పేరు, BCCI లోగో, ఆసియా కప్ 2025 లోగో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే డ్రీమ్ 11 లోగో మాత్రం ఉండకపోవచ్చు. గతంలో ఈ కంపెనీతో BCCI టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకోవడంతో, ఆటగాళ్ల జెర్సీపై డ్రీమ్ 11 లోగో ఛాతి వద్ద పెద్ద అక్షరాల్లో ఉండేది.
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం.. ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్..?
ప్రస్తుతం ఈ మార్పుకు కారణం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన “ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025”. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో త్వరలోనే చట్టంగా మారనుంది. దీని ప్రకారం, డబ్బు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం అమలులోకి రానుంది. భారత్‌లో ఇలాంటి ఫాంటసీ గేమ్స్‌లో అతిపెద్ద కంపెనీ డ్రీమ్ 11 కావడంతో, దీని వ్యాపారం పూర్తిగా ప్రభావితం అవుతుంది. డ్రీమ్ 11 క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ తదితర క్రీడల్లో ఫాంటసీ గేమ్స్ నడుపుతూ మంచి ఆదాయం సంపాదించింది. ఈ ఆర్జన ఆధారంగా చేసుకుని 2023లో బీసీసీఐతో 358 కోట్ల రూపాయల విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 వరకు ఉండే ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు జెర్సీతో పాటు ట్రైనింగ్ కిట్‌లపై కూడా డ్రీమ్ 11 పేరు పెద్ద అక్షరాల్లో కనిపించేది.
Kamareddy Crime News: పురుషులతో పురుషులకే వల.. కామారెడ్డిలో వెలుగులోకి ముఠా ఆగడాలు!
కానీ ఇప్పుడు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డ్రీమ్ 11 తన వ్యాపారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కంపెనీ ముందుగానే ఆ స్పాన్సర్‌షిప్ డీల్ నుంచి తప్పుకోవచ్చు. బీసీసీఐ కూడా కొత్త స్పాన్సర్‌ని వెతకలేకపోతే, ఆసియా కప్ 2025లో భారత జెర్సీపై ఎలాంటి కంపెనీ లోగో లేకుండానే ఆటగాళ్లు మైదానంలోకి దిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే, BCCIకి ఆర్థిక నష్టం తప్పదు. ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం, ఒక్కో బైలేటరల్ లేదా ఆసియా కప్ మ్యాచ్‌కి డ్రీమ్ 11 నుంచి బీసీసీఐకి సుమారు రూ.6 కోట్లు వస్తాయి. అయితే, ఐసీసీ టోర్నమెంట్లలో స్పాన్సర్ లోగో ఛాతి మీద కాకుండా చేతి భాగంలో మాత్రమే ఉండటంతో ఆ మొత్తాన్ని రూ. 2 కోట్లుగా నిర్ణయించారు.
