Site icon NTV Telugu

Asia Cup 2025 Final: పాక్ నడ్డీ విరిచిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

India

India

ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన పాక్ కు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. మెరుపు బౌలింగ్ తో విరుచుకుపడి పాక్ నడ్డివిరిచారు. పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణ్ చక్రవర్తి 02, అక్షర్ పటేల్ 02, కుల్దీప్ యాదవ్ 04, బుమ్రా 02 వికెట్లు పడగొట్టారు.

Also Read:Rahul Ravindran: మణిరత్నం..బోయపాటి బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి కొడుకుని కంటే వాడే సుజిత్!

పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ ప్రారంభించారు. శివమ్ దూబే మొదటి ఓవర్ వేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పవర్‌ప్లేలో పాకిస్తాన్ 45 పరుగులు చేసింది. అప్పటి వరకు పాకిస్తాన్ వికెట్ కోల్పోలేదు. ఫర్హాన్ కేవలం 35 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే, 10వ ఓవర్‌లో వరుణ్ ఫర్హాన్ వికెట్ తీసుకున్నాడు. ఫర్హాన్ 38 బంతుల్లో 57 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత, 13వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ సామ్ అయూబ్ వికెట్ తీసుకున్నాడు. అయూబ్ 14 పరుగులు చేశాడు. ఆ తర్వాత, 14వ ఓవర్‌లో అక్షర్ పటేల్ మొహమ్మద్ హారిస్ వికెట్ తీసుకున్నాడు.

Also Read:Jr NTR: ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!

హారిస్ ఖాతా తెరవలేకపోయాడు. 15వ ఓవర్‌లో వరుణ్ ఫఖర్‌ను అవుట్ చేయడంతో పాకిస్తాన్‌కు నాలుగో దెబ్బ తగిలింది. ఫఖర్ 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత, 16వ ఓవర్‌లో అక్షర్ పటేల్ హుస్సేన్ తలాత్ వికెట్ తీసుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో కుల్దీప్ కెప్టెన్ సల్మాన్ అఘాను అవుట్ చేశాడు. అదే ఓవర్ లో ఖాతా కూడా తెరవలేని షాహీన్ ను కూడా అవుట్ చేశాడు. అదే ఓవర్ లో కుల్దీప్ ఫహీమ్ ను కూడా అవుట్ చేశాడు. అంటే ఈ ఓవర్ లో కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బుమ్రా విధ్వంసం సృష్టించాడు. దీంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 146కి ముగిసింది.

Exit mobile version