రోహ్‌తక్ రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఐజీ కార్యాలయంలోని సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాథర్ రోహ్‌తక్‌లోని తన నివాసంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్‌లో ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
Also Read:Ponnam Prabhakar : ప్రజలు బీఆర్ఎస్‌కి గట్టి బుద్ధి చెప్పబోతున్నారు
అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అతను IPS Y. పురాణ్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. నోట్‌లో, సందీప్ లాథర్, పురాణ్ కుమార్‌ను అవినీతిపరుడిగా పేర్కొన్నాడు. అరెస్టు భయంతో పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని రాసుకొచ్చాడు. “నా ప్రాణాలను త్యాగం చేసి దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవినీతి కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు” అని అతను లేఖలో వెల్లడించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సూసైడ్ నోట్, వీడియోను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ నెల 7న పూరన్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాన్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు.
