Site icon NTV Telugu

Tablet: మేడిన్‌ ఇండియా ‘ట్యాబ్‌’.. కిందపడేసి తొక్కినా పగలదు!

Ashwini Vaishnav

Ashwini Vaishnav

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. భారత్ లో తయారైన ట్యాబ్ మన్నికను పరీక్షించిన ఆయన కింద పడేసి తొక్కినా పగలదని తెలిపారు. వీవీడీఎన్ టెక్నాలజీస్ ను సందర్శించిన ఆయన అక్కడ తయారైన ఉత్పత్తులను పరీక్షించారు. వీవీడీఎన్ టెక్నాలజీ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీ, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఇంజనీరింగ్ వంటి రంగాలలో పనిచేస్తుంది.

Also Read:Pooja Hegde : జాలి లాంటి చీరలో పూజాహెగ్డే అందాల ఫోజులు

ఆ వీడియోలో అశ్విని వైష్ణవ్ చేతిలో ఒక గాడ్జెట్ కనిపిస్తుంది. అది టాబ్లెట్ లాగా కనిపిస్తుంది. అశ్విని వైష్ణవ్ దానిని కొంత ఎత్తు నుంచి టేబుల్ మీదకు జార విడిచారు. అక్కడే ఉన్న సంస్థ సిబ్బంది “ఇది పగలదు సార్” అని చెబుతారు. ఒక వేళ కిందపడినప్పుడు వాహనం దానిపై నుంచి వెళితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. అయినప్పటికీ అది విరిగిపోదు సార్ అని సమాధానం ఇచ్చారు.

Also Read:Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా.. ముహూర్తం ఖరారు?

తర్వాత దాన్ని కింద పెట్టి తన పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని తొక్కమన్నారు. అతను ఆ గాడ్జెట్ మీద నిలబడ్డాడు. ఆ తర్వాత మంత్రి కూడా గాడ్జెట్ పైకి ఎక్కాడు. కానీ గాడ్జెట్ సురక్షితంగా ఉంది. వీడియోను చూస్తే, ఈ టాబ్లెట్ మిలిటరీ గ్రేడ్ మన్నికతో తయారు చేయబడిందని భావిస్తున్నారు. అయితే, ఈ టాబ్లెట్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియలేదు.

Exit mobile version