Site icon NTV Telugu

Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్‌స్పిరేషన్..!

Ashika Ranganath

Ashika Ranganath

Ashika Ranganath: జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషనల్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఫైనల్ ఈవెంట్‌ నేడు హైదరాబాద్ లో తారల మధ్య జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా.. హీరోయిన్ ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అంటూ స్టేజ్‌పైకి వచ్చిన ఆమె, ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం ఈవెంట్ ఎంతో ఎనర్జిటిక్‌గా, లైవ్లీగా సాగుతోందని ఆమె పేర్కొన్నారు.

కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!

సుమారు 7 నుంచి 8 నెలల జర్నీ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్ కూడా ఒకేసారి జరిగాయని ఆషిక తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం చాలా కష్టమైనప్పటికీ.. స్పెయిన్‌లో 20 రోజులు షూట్ చేసి, సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రొడక్షన్ టీం కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా SLVSC ప్రొడక్షన్స్, నిర్మాత సుధాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హీరో రవితేజ గురించి మాట్లాడుతూ.. విక్రమార్కుడు సినిమా రిలీజైనప్పుడు తాను చిన్నపిల్లనని, ఆ సినిమాలో ఆయన పోషించిన రెండు పాత్రలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని గుర్తు చేసుకున్నారు. అలాంటి సూపర్ స్టార్‌తో కలిసి సినిమా చేయడం తనకు కలలా అనిపించిందని చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై ఈ స్థాయికి వచ్చిన రవితేజ ప్రయాణం ఎంతో ఇన్‌స్పైరింగ్ అని, ఆయన డిసిప్లిన్, ఎనర్జీ, హ్యూమానిటీ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు.

అలాగే దర్శకుడు కిశోర్ తిరుమలకు ధన్యవాదాలు చెబుతూ.. ‘మానస శెట్టి’ అనే పాత్రకు ఇంత లెంగ్త్, స్పేస్ ఇవ్వడం తనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పారు. ఆ పాత్రను ఎలా బిల్డ్ చేయాలో సెట్స్‌లో చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో పనిచేసిన వెన్నెల కిశోర్, సత్య, సునీల్, మురళీధర్, రోహన్, సోనియా తదితర నటులతో సెట్స్‌లో చాలా ఫన్ జరిగిందని తెలిపారు. పెద్ద కాస్ట్ ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం పట్ల తాను ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నానని అనింది.

Union Budget 2026: ఈ బడ్జెట్ గుడ్‌న్యూస్‌ చెబుతుందా..! పన్ను విధానం మారుతుందా…?

డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆషిక.. ఈ సినిమాలో మూడు పాటల్లో తాను కనిపిస్తానని తెలిపారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన రెండు పాటలు తనకు కల నెరవేరినట్లుగా అనిపించాయని, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన లాస్ట్ సాంగ్ థియేటర్లలో బ్లాస్ట్ అవుతుందని హింట్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ అందరినీ ఎంతో అందంగా చూపించారని, తన లుక్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హీరోయిన్ డింపుల్ తో కలిసి డాన్స్ చేయడం చాలా మంచి అనుభవమని, ‘వామయో’ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉందని అన్నారు. చివరగా, జనవరి 13న సినిమా విడుదల అవుతుందని, అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

Exit mobile version