NTV Telugu Site icon

AS Ravikumar Chowdary : ఆ హీరోయిన్ కు ముద్దు పెడితే తప్పేంటి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ దర్శకుడు..

Whatsapp Image 2023 08 30 At 3.37.07 Pm

Whatsapp Image 2023 08 30 At 3.37.07 Pm

ఏ ఎస్ రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోపిచంద్ హీరోగా యజ్ఞం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అవి అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా ‘తిరగబడరా సామీ’ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కించారు . ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో రాజ్​తరుణ్​తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కూడా నటించారు. ఈ చిత్రం వైవిధ్యభరితమైన కథతో వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించారు. ఎం.ఎన్‌.జవహర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. త్వరలోనే ఈ సినిమాగా రిలీజ్​ కానుంది.. అయితే ఇటీవల చిత్ర యూనిట్ ‘తిరగబడరా సామీ’ చిత్ర టీజర్ విడుదల చేశారు టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

తిరగబడరా సామీ మూవీలో మన్నారా చోప్రా ముఖ్య పాత్ర పోషించింది. దీనితో ఈమె టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. మీడియా రవికుమార్ చౌదరి మన్నారా చోప్రా తో ఎంతో సన్నిహితంగా వ్యవహరించారు. దగ్గరకు తీసుకుని ఆమెను ముద్దాడారు. మన్నారా సిగ్గుతో నవ్వుతూ పక్కకు వెళ్లిపోయింది.. పబ్లిక్ లో ఏ ఎస్ రవికుమార్ హీరోయిన్ కి ముద్దు పెట్టడంపై సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శల కు దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి తనదైన స్టైల్ లో స్పందించారు..అసలు మన్నారా చోప్రాకు ముద్దు పెడితే తప్పేంటి. నేనేమైనా వేరే ఉద్దేశం తో ముద్దు పెట్టానా.. ఆమెను  నా కూతురిలా భావించి ఆప్యాయతతో ముద్దు పెట్టుకున్నాను. అయినా మన్నారాకు, నా కుటుంబ సభ్యులకు లేని నొప్పి మీకెందుకు అని చెప్పుకొచ్చారు.. ఆమె నా చిత్రంలో అద్భుతంగా నటించింది.. అందుకే ముద్దు పెట్టుకున్నాను…’ అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఏ ఎస్ రవికుమార్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.