US Open 2024 Winner is Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ 2024 మహిళల ఛాంపియన్‌గా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచింది. శనివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంకా గెలుపొందింది. దీంతో కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సబలెంక సొంతం చేసుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకకు ఇది మూడవ గ్రాండ్ స్లామ్.
Also Read: World Biggest iPhone: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ‘ఐఫోన్’.. చేసింది మనోడే!
అరీనా సబలెంక 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌ను తృటిలో కోల్పోయింది. అమెరికా సంచలనం కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. 2022లో సెమీ-ఫైనలిస్ట్ అయిన సబలెంక ఈసారి యూఎస్ ఓపెన్‌ను గెలిచింది. ‘గతంలో ఓటములన్నీ నాకు గుర్తున్నాయి. కలను ఎప్పటికీ వదులుకోవద్దు. ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం నాకు మాటలు రావడం లేదు. యుఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకోవడానికి నేను చాలా దగ్గరగా ఉన్నానని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇది నా కల. చివరకు ట్రోఫీని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని సబలెంక తెలిపింది.