తెలంగాణలో మేము పర్యటిస్తున్నామని, ఇది మా ఆరో రాష్ట్రమని 16వ పైనాన్స్ కమిషన్ చైర్మన్ అర్వింద్ పనగారియా తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా పారదర్శకంగా చర్చలు జరిగాయని, రాష్ట్రం లోనీ ఆర్థిక పరిస్థితిని రాష్ట్రం వివరించిందన్నారు. తెలంగాణ లో ఉన్న భవిష్యత్ ప్రణాళిక లు పైనన్స్ కమీషన్ ను ఆకర్షించిందని, అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ పోకస్ చేయడం అభినందనీయమన్నారు అర్వింద్ పనగారియా. దీంతో పాటుగా గ్రామీణాభివృద్ధి పై కూడా పోకస్ చేశారని, రాష్ట్రం లో ఆర్ధిక వృద్ధి , అప్పులపై ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు అర్వింద్ పనగారియా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభిప్రాయాలను, వినతులను తీసుకున్నామని ఆయన తెలిపారు.
Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య.. మాకేంట్రా ఇదీ?
లోకల్ బాడి అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులను తీసుకున్నామని ఆయన వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల పై ప్రభుత్వం నుంచి వినతి ఇచ్చారని, దేశ వ్యాప్తంగా పర్యటన కొనసాగుతోంది…తెలంగాణ రాష్ట్రం ఆరోవ రాష్త్రమన్నారు. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చింది..కమిషన్ సంతృతి చెందిందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ లో తెలంగాణ అభివృద్ధి భాగ జరుగుతోందని కితాబిచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధుల కేటాయింపు పెంపు పై దృష్టి సారించాలని కోరారని, 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు 41శాతం కేంద్రం కేటాయింపులు చేసిందన్నారు. కమిషన్ ఇచ్చే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది… నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం ఆలోచన విధానాన్ని మేము ప్రశ్నించలేమని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వినతుల్లో ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కేంద్రానికి కమిషన్ సిఫార్సు చేస్తుందన్నారు.
Samsung: ‘‘మడత పెట్టినప్పుడు చెప్పండి’’..ఆపిల్ ఐఫోన్ 16పై సామ్‌సంగ్ సెటైర్లు..
