NTV Telugu Site icon

Kejriwal: బెయిల్‌పై హైకోర్టులో లభించని ఊరట.. జైల్లోనే ఉండనున్న కేజ్రీవాల్

De

De

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్, ఆప్ నేతలకు భంగపాటు ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే కొనసాగించింది. కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఢిల్లీ కోర్టు సరైన మైండ్ ఉపయోగించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్‌‌పై ఈడీ అభ్యంతరానికి హైకోర్టు సమ్మతి తెలిపింది. దీంతో మరిన్ని రోజులు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింంది. ఇదిలా ఉంటే బుధవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Fire Accident: జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు

లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు గత వారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యేందుకు కేజ్రీవాల్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఇంకోవైపు ఆప్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ఈడీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మూడు రోజుల పాటు విడుదలను పెండింగ్‌లో పెట్టింది. ఈడీ పిటిషన్‌పై మంగళవారం ధర్మాసనం విచారించి.. బెయిల్‌పై స్టే కొనసాగించింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కేజ్రీవాల్ మరిన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుధవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Funny Answers : మరో జాతిరత్నం దొరికేసాడు.. ప్రశ్నలకు సమాధానాలు చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. మధ్యలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల రావడంతో 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.

ఇది కూడా చదవండి: Piyush Goyal: ఏకగ్రీవంగా స్పీకర్ను ఎన్నుకుంటే…(వీడియో)

Show comments