NTV Telugu Site icon

Swati Maliwal: నాపై దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు.. స్వాతి మలివాల్ సంచలనం..

Swati

Swati

Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. మే 13న కేజ్రీవాల్ నివాసంలోనే తనపై దాడి జరిగిందని, తాను కేకలు వేసినా కూడా సహాయం చేయడానికి ఎవరూ రాలేదని చెప్పారు. బిభవ్ కుమార్ తన చెంపపై కొడుతూ తన్నాడని, ఈడ్చుకెళ్లాడని ఆప్ ఎంపీ పేర్కొన్నారు.

Read Also: Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?

‘‘ మే 13 ఉదయం 9 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి అతడిని చూసేందుకు వెళ్లాను. అతని సిబ్బంది తనను డ్రాయింగ్ రూంలో కూర్చోమని చెప్పారు. అరవింద్ జీ ఇంట్లోనే ఉన్నారని, నన్ను కలవడానికి వస్తున్నారని చెప్పారు. మరుసటి క్షణం బిభవ్ కుమార్ డ్రాయింగ్ రూంలోకి వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించారు. 7-8 సార్లు చెంపపై కొట్లటాడు. నేను అతడిని నెట్టడానికి ప్రయత్నించిన సమయంలో పట్టుకున్నాడు. నా తల టేబుల్‌కి తగిలి కింద పడ్డాను. ఆ తర్వాత నన్ను తన్నడం ప్రారంభించాడు’’ అని స్వాతి మలివాల్ చెప్పారు.

తాను సాయం కోసం అరిచినా, ఎవరూ రాకపోవడం తనకు వింతగా ఉందని చెప్పారు. ఎవరైనా సూచనల మేరకు బిభవ్ కుమార్ వ్యవహరిస్తున్నారా..? అని ప్రశ్నించిన సమయంలో.. మలివాల్ మాట్లాడుతూ.. ‘‘ఇదంతా ఇప్పుడు దర్యాప్తు విషయం, నేను ఢిల్లీ పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తున్నాను. నేను ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, తాను డ్రాయింగ్ రూంలో ఉన్న ప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’’ అని ఆమె చెప్పారు. నా భద్రత, నా కెరీర్ విషయంలో వీరు ఎంత వరకు వెళ్లవచ్చనే విషయాన్ని తాను పట్టించుకోనని ఆమె అన్నారు. ఈ విషయంలో ఆప్ బిభవ్ కుమార్‌కి ఎందుకు మద్దతు ఇస్తుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. దాడి జరిగిన తర్వాత బిభవ్ కుమార్ తాను పోలీసులకు ఫోన్ చేస్తున్న విషయాన్ని గమనించి గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీని పిలిచి వీడియో తీయించాడని ఆమె చెప్పారు.