Arvind Kejriwal: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తన జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన(Jai Bhim Mukhyamantri Pratibha Vikas Yojana)ను పునఃప్రారంభించబోతోంది. దీని కింద మెడికల్, ఇంజినీరింగ్, సివిల్ సర్వీసులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2018లో మొదటిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ దానిని నిలిపివేయవలసి వచ్చింది. ప్రభుత్వం దీన్ని మళ్లీ ప్రారంభించబోతోందని, మరికొన్ని పోటీ పరీక్షలను కూడా ఇందులో చేర్చనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ ఏసీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు. మార్పులతో ప్రణాళిక సిద్ధమైందని, ఆమోదం కోసం క్యాబినెట్‌లో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో SC, ST, OBC, EWS వర్గాల విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్నారు.
Read Also:Telangana Elections 2023: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు
ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఇందులో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం అందించింది. కోచింగ్ కోసం ప్రయాణాలు, పుస్తకాలు కొనుగోలు చేయడంలో వారికి సహాయపడటానికి ఇది ఇవ్వడం జరిగింది. ఒక బ్యాచ్‌లో సుమారు 5000 మంది విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి రావడంతో దాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ పథకం నవంబర్ 2021లో మరోసారి ప్రారంభించబడింది. 13 వేల మంది విద్యార్థులు దీని ప్రయోజనాన్ని పొందారు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. కోచింగ్ సెంటర్లకు సకాలంలో డబ్బులు వచ్చేలా పథకంలో మరికొన్ని మార్పులు చేశామని మంత్రి తెలిపారు. విద్యార్థుల వెరిఫికేషన్ అనంతరం ప్రతి ఆరు నెలలకోసారి కోచింగ్ సెంటర్లకు చెల్లింపులు జరుగుతాయి. దీంతోపాటు విద్యార్థులకు ప్రతి మూడు నెలలకోసారి స్టైఫండ్ కూడా అందజేస్తామన్నారు. ఇందులో మరిన్ని పోటీ పరీక్షలను ప్రభుత్వం చేర్చబోతోందని తెలిపారు. కేబినెట్ ఆమోదం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పినట్లు సమాచారం. లక్ష్యం నెరవేరాలంటే మంచి కోచింగ్ సెంటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Read Also:Raashi Khanna: చూపులు తో మదిని దోచుకుంటున్న రాశి ఖన్నా..
