Site icon NTV Telugu

Himanta Biswa Sarma : ఆయనే అరెస్ట్ ను ఆహ్వానించారు.. కేజ్రీవాల్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు

New Project (2)

New Project (2)

Himanta Biswa Sarma : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. అరెస్టును కేజ్రీవాల్ స్వయంగా ఆహ్వానించారని ఆయన అన్నారు. మొదటి సమన్‌పై ఈడీకి ఎదుట హాజరై ఉంటే ఈ రోజు అతడు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. కానీ అతను అలా చేయలేదు. ఎవరికైనా 8-9 సార్లు సమన్లు అంటే గౌరవం లేకుండా చేసుకున్నారని సీఎం శర్మ అన్నారు. ఇది అతడి నిర్లక్ష్యమన్నారు. దాని అర్థం ఏమిటి. నన్ను అరెస్టు చేయమని కోరడం కాదా అన్నారు.

Read Also:IPL 2024 Tickets: విశాఖలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకం నేటి నుంచి అన్లైన్ లో ప్రారంభం..!

అస్సాం ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ.. ఈడీ మొదటి సమన్లకు కేజ్రీవాల్ ప్రతిస్పందించి ఉంటే, బహుశా అతను ఈ రోజు అరెస్టు చేయబడి ఉండేవాడు కాదు. వెళ్లలేదు అంటే అతనే స్వయంగా నన్ను అరెస్ట్ చేయమని ఆహ్వానించాడు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది.

Read Also:Drug Rocket: డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐకి కొత్త డౌట్స్..

గురువారం రాత్రి ఈడీ బృందం కేజ్రీవాల్ ఢిల్లీ నివాసానికి చేరుకుంది. కొన్ని గంటలపాటు ఇంట్లో వెతికారు. దీని తర్వాత రాత్రి 9 గంటల సమయంలో దర్యాప్తు సంస్థ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసింది. అతని అరెస్టు తర్వాత ఈడీ శుక్రవారం అతన్ని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్‌కు పది రోజుల రిమాండ్ విధించాలని ఈడీ బృందం కోర్టును ఆశ్రయించింది. తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇందుకోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇడి అరెస్ట్, రిమాండ్ ఆర్డర్ రెండూ చట్టవిరుద్ధమని పేర్కొంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

Exit mobile version