Site icon NTV Telugu

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెల్తీగానే ఉన్నారు కానీ..

Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్‌ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తెలిపింది. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన మెడికల్‌ బోర్డు ఇవాళ ( ఏప్రిల్ 27) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేసింది. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించింది.

Read Also: Botsa Satyanarayana: చంద్రబాబులాగా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యం..

కాగా, సుమారు అర్థగంట సేపు కేజ్రీవాల్ తో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని.. రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని వారు సూచించినట్లు పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత ఈ బృందం మరోసారి అరవింద్ కేజ్రీవాల్ పరీక్షించనున్నట్లు వెల్లడించారు. అయితే, ఢిల్లీ సీఎం ఒంట్లోని చక్కెర స్థాయిలు 320కి పెరగడంతో గతవారం ఆయనకు తొలిసారి జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చారు. దీంతో తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించే ఛాన్స్ ఇవ్వాలని కేజ్రీవాల్‌ ఢిల్లీ కోర్టును కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనకు ఈడీ అడ్డుపడింది.

Read Also: Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..

ఇక, కేజ్రీవాల్, ఈడీ తరపున వాదనలు విన్న న్యాయస్థానం.. ఢిల్లీ సీఎం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా..? అని పరీక్షించేందుకు డాక్టర్ల కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి.. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపింది.

Exit mobile version