Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- కేజ్రీవాల్ కుటుంబానికి SIR నోటీసులు
- ‘ఇదెలా సాధ్యం?’ అంటూ ఈసీపై ఆప్ ఫైర్
- డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన 20 రోజుల తర్వాత నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా నోటీసులు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలో వివరాలకు సంబంధించిన అసమానతల నేపథ్యంలో ఢిల్లీలో మొత్తం 33.1 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవికి కూడా నోటీసులు అందాయి. కేజ్రీవాల్ న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటరుగా ఉన్నారు.
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
ఈసీపై ఆప్ తీవ్ర విమర్శలు
కేజ్రీవాల్ కుటుంబ సభ్యులకు నోటీసులు రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసిన ఆప్.. ‘‘ఈ దేశంలో జరుగుతున్న ప్రతిదీ సుప్రీం లార్డ్‌ను సంతోషపెట్టేందుకేనా? మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఢిల్లీ ఓటర్ల జాబితాలో లేకపోవడం ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించింది.
‘నో మ్యాపింగ్’, ‘లాజికల్ డిస్క్రెపెన్సీస్’ కేటగిరీలు
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 31న ప్రచురించిన దాదాపు మూడు వారాల తర్వాత ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం SIRలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో గత SIRతో వివరాలను అనుసంధానం చేయలేని ఓటర్లను “No Mapping”, వివరాల్లో తార్కిక అసమానతలు ఉన్నవారిని “Logical Discrepancies” కేటగిరీల్లో చేర్చారు. ఈ నేపథ్యంలోనే గత SIRతో కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల వివరాలను మ్యాప్ చేయడం సాధ్యం కాకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కపిల్ సిబల్కూ నోటీసులు
రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా గత SIRతో వివరాలు మ్యాప్ కాకపోవడంతో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. మాజీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఆయన భార్య, సోదరుడికి కూడా పేర్లలో అసమానతల కారణంగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
33 లక్షలకుపైగా ఓటర్లకు నోటీసులు
ఎన్నికల అధికారులు గతంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 13,79,785 మంది ఓటర్ల వివరాలను గత SIRతో మ్యాప్ చేయలేకపోయారు. మరో 19,33,134 మంది ఓటర్ల వివరాల్లో “లాజికల్ డిస్క్రెపెన్సీస్” ఉన్నట్లు గుర్తించారు. వీరి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ.. వివరణ కోసం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!