NTV Telugu Site icon

Arvind Kejriwal: “వచ్చే ఎన్నికల్లో నేను బీజేపీ తరఫున ప్రచారం చేస్తా”.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal

Arvind Kejriwal

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఛత్రసాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బీజేపీ పనితీరుపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనితో పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే డబుల్ లూట్ అని అని విమర్శించారు. యూపీలో గత ఏడేళ్లుగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని.. కానీ అది విఫలమైందన్నారు.

READ MORE: Atla Bathukamma 2024: నేడు ఐదో రోజు అట్ల బతుకమ్మ.. నైవేద్యంగా అట్లు లేదా దోశ..

ప్రధాని మోడీ 10 ఏళ్ల పదవీకాలంపై లేవనెత్తిన ప్రశ్నలు:
కేజ్రీవాల్, ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ పదేళ్ల పదవీకాలంపై ప్రశ్నలు లేవనెత్తారు. “10 సంవత్సరాలలో ఈ వ్యక్తులు(బీజేపీ నాయకులు) ఏమీ చేయలేదు. వచ్చే ఏడాదిలో ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండుతాయి ఇప్పటికైనా ప్రజలకు ఏమైనా చేయండన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ను ప్రధాని ప్రకటిస్తే, నేను బీజేపీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు.

READ MORE:Pragya Jaiswal : ఎర్రటి డ్రెస్ లో సిమ్లా యాపిల్ లా కనిపిస్తున్న ప్రగ్యా

డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి
“హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ముగుస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. అలాంటప్పుడు హర్యానాలో 10 ఏళ్ల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏం చేసింది? గత 7 ఏళ్లుగా యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వీరి సీట్లు సగానికి తగ్గాయి. మణిపూర్‌లో 7 సంవత్సరాల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. రెండేళ్లుగా మణిపూర్ మండుతోంది.” అని వ్యాఖ్యానించారు.

Show comments