Site icon NTV Telugu

CBG Plant: ఏపీలో సీబీజీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆర్వెన్సిస్‌ గ్రూప్‌!

Cbg Plant Ap

Cbg Plant Ap

ఏపీలో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్ నిర్మాణానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఆర్వెన్సిస్‌ గ్రూప్‌ సంస్థ ప్రతినిధులు ఈరోజు తాడేపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ను కలిశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంట్ నిర్మాణానికి ఒకే చెప్పారు. తొలుత రూ.150 కోట్లతో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 12-20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు.

Also Read: PM Modi Amaravati Tour: ప్రయాణికులకు అలర్ట్.. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు!

భూ కేటాయింపులు, ఇతర అనుమతుల అనంతరం సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్వెన్సిస్‌ గ్రూప్‌ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. సింగిల్ విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులకు మంత్రి గొట్టిపాటి తెలిపారు. సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రకాశం కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుందన్నారు. బయో ఫ్యూయల్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. రిలయన్స్‌ సంస్థ దేశంలో నాలుగు సీబీజీ హబ్‌లను ఏర్పాటు చేయనుండగా.. అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించింది.

Exit mobile version