Professor Dance Video Goes Viral In Social Media: తాజాగా కాలేజీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ‘కాలా చష్మా…’ పాటపై డ్యాన్స్ చేస్తున్న కొందరు మహిళా కాలేజీ ప్రొఫెసర్లు వేదికపై కనిపిస్తున్నారు. అక్కడ వారందరు చీరకట్టులో ఉన్నారు. అయితే ఇందులో ఓ ప్రొఫెసర్ అరుణిమ దేవాశిష్ అద్భుతంగా స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ వీడియో కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీకి సంబంధించినది. వీడియో వైరల్‌గా మారడంతో ఇప్పటికే కోటి మందికి పైగా వీక్షించారు. ఇక వీడియోకు కామెంట్ సెక్షన్ మోత మోగిపోతుంది. వేదికపై ఉన్న బాలికలు కూడా తమ టీచర్‌ను చాలా ఉత్సాహపరిచారు. వీడియోను పోస్ట్ చేసిన విద్యార్థి.. మా ఉపాధ్యాయులు చాలా మంచివాళ్ళు అంటూ రాసుకొచ్చాడు.
POSCO Case: దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇతరులతో పాటు గాయకుడు, రాపర్ బాద్షాద్ కూడా వీడియోపై కామెంట్ చేసారు. అతను ప్రెజెంట్ మేడమ్… అంటూ రాసుకొచ్చాడు. ప్రొఫెసర్ అరుణిమా దేవాశిష్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 6,000 మందికి పైగా ఫాలోయర్స్ ను కలిగి ఉన్న ప్రొఫెషనల్ డ్యాన్సర్. టీచర్లు పిల్లలతో సరదాగా గడిపిన ఇలాంటి వీడియోలు గతంలో కూడా చాలా వైరల్ అయ్యాయి. ఇదివరకు ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తన పుట్టినరోజున తరగతిలోని పిల్లలతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ‘కజరారే…’ పాటపై మేడమ్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.