NTV Telugu Site icon

Delhi Liquor Scam: తమ పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్

Manish Sisodia

Manish Sisodia

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్‌ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సిసోడియాకు సూచిస్తూ.. పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు సిసోడియాతో పాటు సత్యేందర్‌ జైన్‌ సైతం రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మనీలాండింగ్‌ కేసులో జైలులో ఉన్నారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమోదించారు.

Read Also: Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఢిల్లీలో ఘటన జరిగినందున తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఢిల్లీలో ఉన్నంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావడంపై ప్రశ్నించింది. ఢిల్లీలో ఘటన జరిగినంత మాత్రాన ఈ కేసు సుప్రీంకోర్టుకు వస్తుందనడంతో అర్థం లేదని అని జస్టిస్‌ నరసింహ అన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.