Site icon NTV Telugu

Tirupati: ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం..

Tirupathi

Tirupathi

తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెంగళూరు అర్బన్ లో 30 శాతం ఏ.ఎస్.డి ఉంది.. ఇక, స్ట్రాంగ్ రూంలో ఈవీఏంలు పటిష్ఠమైన భద్రంగా ఉన్నాయి.. చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తాం.. తిరుపతి జిల్లాలో 24 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక, జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

Read Also: Kannappa : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కన్నప్ప టీం..నేడు గ్రాండ్ గా టీజర్ రిలీజ్..

అలాగే, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు తర్వాత జరిగిన ఘర్షణలపై 5 కేసులు నమోదతో పాటు 54 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. జిల్లాలో 60 చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాం.. కౌంటింగ్ రోజు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలు, 1 కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగాలు జిల్లాలో ఉన్నాయి.. కౌంటింగ్ రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయకూడదు.. తర్వాత రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇస్తాం.. ఎన్నికల కౌంటింగ్ పై బెట్టింగ్ కాస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని ఎస్పీ హర్షవర్థన్ రాజు వెల్లడించారు.

Exit mobile version