NTV Telugu Site icon

Manipur violence: కనిపిస్తే కాల్చేయండి.. సైన్యాన్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం

Manipur

Manipur

Manipur violence: మణిపూర్‌లో ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసాకాండ తర్వాత, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. హింసాత్మక ప్రాంతాలలో హింసకు పాల్పడేవారిని కనిపించగానే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హింసకు పాల్పడే వ్యక్తులను కనపడగానే కాల్చిచంపాలన్న ఆదేశాన్ని గవర్నర్ ఆమోదించారు. హింసాత్మక ప్రాంతాల్లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మోహరించారు.

హింసాత్మక ప్రాంతాల నుంచి భద్రతా బలగాలు ఇప్పటివరకు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలందరూ శాంతిభద్రతలను కాపాడాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో శాంతి, సామరస్యాలను కాపాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన విజ్ఞప్తి’ అని ట్వీట్ చేశారు.