NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఆషాఢ మాసం బోనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. అన్ని సదుపాయాలకు రూ.20కోట్లు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. నగరంలో బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

READ MORE: Parliament Session : ఒంటెపై పార్లమెంటు సమావేశాలకు వచ్చిన ఎంపీ.. అడ్డుకున్న పోలీసులు

బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఉత్సవాలకు రాబోయే నెల రోజుల పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గత సంవత్సరం బోనాలకు 15 కోట్లు నిధులు ఇస్తే దేవాదాయ శాఖ మంత్రి గారి చొరవతో ఈసారి రూ. 20 కోట్లు కేటాయించారని స్పష్టం చేశారు.బల్కం పేట ఎల్లమ్మ ఆలయంలో పోలీసులు, విద్యుత్, వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్ ల వారీగా సమీక్ష జరుపుకుంటున్నామన్నారు.
సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, పోలీస్, విద్యుత్, వాటర్ వర్క్స్ , ఆర్ అండ్ బీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.