Site icon NTV Telugu

IPL2023 : సీఎస్కే మ్యాచ్ తో.. సచిన్ తనయుడు అరంగేట్రం నేడే..!

Arjun Tendulkar

Arjun Tendulkar

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16 ఎడిషన్ లో తమ తొలి మ్యాచ్ లోనే ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 8న) చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలాని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్ లో పలు మార్పులతో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు ముంబై పేసర్ జోఫ్రా ఆర్చర్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ.. గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్ కు జోఫ్రా అర్చర్ దూరం అయితే మాత్రం.. అతడి స్థానంలో మెరిడిత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : Konda Vishweshwar Reddy: ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదు

అలాగే ఈ మ్యాచ్ లో యువ స్పిన్నర్ హృతిక్ షోకిన్ స్థానంలో కుమార్ కార్తీకేయకు అవకాశం ఇవ్వాలని ముంబయి ఇండియన్స్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరొవైపు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సీఎస్కే మ్యాచ్ తో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ జట్టులో చేరిన అర్జున్.. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. కాగా సీఎస్కే మ్యాచ్ కు ముందు అర్జున్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ముంబై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా దేశవాళీ క్రికెట్ లో గోవా తరపున అర్జున్ ఆడుతున్నాడు. రంజీ సీజన్ 2022-23లో అర్జున్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన మ్యాచ్ లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 7 లిస్ట్-ఏ ( 25 వికెట్లు ) మ్యాచ్ లు ఆడిన అతను.. ఐదు ఫస్ట్ క్లాస్ ( 9వికెట్లు ) మ్యాచ్ లు, 9 టీ20 మ్యాచ్ లు ( 12 వికెట్లు ) ఆడాడు.

Also Read : Chiru: బర్త్ డే బాయ్స్ కి మెగా విషెస్… బన్నీ చేసిన తప్పు చిరు చెయ్యలేదు

Exit mobile version