MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాకు చెందిన ఆరిఫ్ ఖాన్ చిష్తి తన అనే ముస్లిం యువకుడు కుల, మతాలను పక్కనపెట్టాడు. తన కిడ్నీని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ మహారాజ్‌కు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆరిఫ్ ఖాన్ ప్రేమానంద్ మహారాజ్, జిల్లా యంత్రాంగానికి ఒక లేఖ పంపారు. జాతీయ ఐక్యత కోసం ప్రబోధించే ప్రేమానంద్ దీర్ఘాయుష్షుతో జీవించాలని, తద్వారా దేశ సమగ్రతను కాపాడటంలో ప్రత్యేక కృషి చేయాలని కోరాడు.
READ MORE: Smuggling : సినిమా ఐడియా.. క్రైమ్ రియాలిటీ.. పుష్పలా గంజాయి ట్రాన్స్‌పోర్ట్..!
ఇటార్సి జిల్లా నివాసి అయిన ఆరిఫ్ ఖాన్ ఒక చిన్న దుకాణంలో కొరియర్‌గా పనిచేస్తున్నాడు. కానీ అతని ఆలోచన చాలా విశాలమైనది. దేశవ్యాప్తంగా అన్ని మతాల మధ్య ప్రేమ, సామరస్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రేమానంద్ మహారాజ్‌కి ఆకర్షితుడయ్యాడు. తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి, ఆరిఫ్ ప్రేమానంద్ జీ ప్రసంగాల వీడియోలను సోషల్ మీడియాలో చూశాడు. ఆ వీడియోలు, ప్రవచనాలు అతనిలో ప్రేమానంద్ జీ పట్ల గౌరవాన్ని రేకెత్తించించాయి. దీంతో సోషల్ మీడియాలో నిరంతరం ఆయనను అనుసరించడం ప్రారంభించాడు. ప్రేమానంద్ జీ రెండు మతాల మధ్య ప్రేమ, సామరస్యం గురించి మాట్లాడినప్పుడు ఆరిఫ్ ఉప్పొంగిపోయేవాడట.
READ MORE: AP ministers Ranks: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే…?
అటువంటి సాధువులు తమ ప్రసంగం ద్వారా జాతీయ ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయాలని, దేశం అంతటా సామరస్య వాతావరణం ఏర్చాలని ఆరిఫ్ ఖాన్ కోరుకుంటున్నాడు. తన కిడ్నీ దానాన్ని ఓ చిన్న బహుమతిగా అభివర్ణించాడు. ఆరిఫ్ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ ఐక్యతకు ఓ ఉదాహరణగా మారుతోంది. దేశంలోని వివిధ మతాల ప్రజలు ఆరిఫ్ లాగా ఆలోచిస్తే, మన దేశంలో ప్రేమ వాతావరణం నెలకుంటుంది. మతాల మధ్య పరస్పర ద్వేషం తొలగిపోతుంది. ప్రతి పౌరుడు నిజమైన భారతీయుడిగా మారుతాడు.
