Aries Horoscope: పరాభవనామ ఏడాదిలో మేషరాశి వారికి సానుకూల ప్రభావాలు కనపడుతున్నాయి. పరాభవనామ ఏడాదిలో మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే.. ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 4. దీన్ని బట్టి చూస్తే ఆదాయం అత్యధికంగా ఉంది. వ్యయం తక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యము తక్కువగా ఉంది. అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి, ఇక్కడ ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మాట విలువను కాపాడుకోవాలి.
పరాభవనామ సంవత్సర ఫలితంలో నాలుగు గ్రహాలు కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అవి గురువు, శని, రాహు, కేతువులు. పరాభవనామ సంవత్సరంలో గురువు మూడు రాశుల్లో ఉంటున్నాడు. అంటే సంవత్సర ప్రారంభంలో మిధున రాశిలో.. అలాగే జూన్ 1 తర్వాత కర్కాటక రాశిలో, అక్టోబర్ చివరి వారం నుండి జనవరి చివరి వారం వరకు సింహ రాశిలో ఉంటారు. అంటే మూడు రాశులు ఆయన ప్రయాణం చేస్తున్నారు.
ఇంకా శని సంచారాన్ని చూసినట్లయితే.. శని సంవత్సరం మొత్తము మీన రాశిలోనే ఉంటున్నారు. రాహు, కేతువుల స్థితిని గనుక చూస్తే రాహువు సంవత్సర ప్రారంభం నుండి డిసెంబర్ మొదటి వారం వరకు ఆయన కుంభరాశిలో ఉంటారు. అలాగే కేతువు సింహ రాశిలో ఉంటారు. ఇక డిసెంబర్ మొదటి వారం తర్వాత మకర రాశిలోకి వస్తారు. అదేవిధంగా కేతువు కర్కాటక రాశిలోకి వెళ్తారు. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరము శుభప్రదమైన ఫలితాలతో కూడినటువంటి ఆశాజనక కాలంగా చెప్పొచ్చు. ఇక్కడ రాహువు లాభస్థానంలో ఉన్నారు. అలాగే ఉత్తరార్థంలో గురువు కూడా పంచమ స్థానంలోకి వెళ్తారు. అంటే అక్టోబర్ తర్వాత కాబట్టి వారికి అనుకూలమైనటువంటి దైవబలం అప్పుడు సిద్ధిస్తుంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు కలుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం చేకూరుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయి.
అలాగే మీరు ఏవైతే ప్రణాళికలు వేస్తారో అవన్నీ సిద్ధిస్తాయి. దీనికి కారణం ఏకాదశంలో ఉన్నటువంటి రాహు బలం యోగిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అఖండమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి పదోన్నతులు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారం లాగా అనిపిస్తూ ఉంటుంది. లాభాలను గడిస్తారు. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇది మంచి విజయానికి సంకేతంగా ఇది కనిపిస్తుంది. ఈ సంవత్సరము ప్రమోషన్లు, అలాగే ఇంక్రిమెంట్స్ ఇవన్నీ బాగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అదృష్ట యోగం సూచితం అవుతుంది. కానీ, ఇక్కడ ద్వాదశ స్థానంలో గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రారంభమయింది.
మేషరాశి వారికి ద్వాదశంలో శని ఉన్నప్పుడు ఆదాయం విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అనవసర ఖర్చులు పెట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా విదేశ, దూర ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గృహ అవసరాలకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉండడం వల్ల తోబుట్టువులతో సఖ్యతగా మెలగాలి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధను పెంచాలి.
జూన్ 2 తర్వాత గురువు ఉచ్చరాశిలోకి వెళ్ళినప్పటికీ ఆయన చతుర్ధంలో ఉన్నారు కాబట్టి.. కొన్ని గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. ఇక అక్టోబర్ చివరిలో పంచమ స్థానంలోకి వెళ్తారు గురువు. అంటే సింహ రాశిలోకి వెళ్ళడం వల్ల వల్ల మంచి ఆ గృహవాహన యోగాలు బలపడతాయి. అలాగే విద్యార్థులకి చాలా గొప్ప ఉన్నత కాలంగా అక్కడ గోచరిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం సెట్ చేసుకోవడానికి కాలం అక్కడ సహకరిస్తుంది. దైవ బలం అప్పుడు బాగా ఉంటుంది. ఇక ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. కారణం ఏంటంటే.. ఏలినాటి శని దోషం ఉన్నది. ఇక పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఈ సంవత్సరము వారు కాలాన్ని గడిపినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఇక పంచమంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల విద్యార్థులకు ఈ సంవత్సరము అక్టోబర్ నుంచి అనుకూల కాలంగా గోచరిస్తుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి ఆ కేతువు వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కేతువు ధ్యాన శ్లోకం చదువుకోవడం మంచిది. దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. సౌమ్యంగా సంభాషించాలి. గృహంలో అశాంతి లేదా ప్రయాణంలో కాస్త ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా ఏలినాటి శని ఉన్న కారణం చేత కొత్తగా పెట్టుబడులు ఏవైనా పెట్టేటట్టయితే జాగ్రత్తగా పెట్టాలి. అంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహు బలం వల్ల స్నేహితుల సహకారం ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం అత్యవసరంగా మేషరాశి వారికి కనిపిస్తుంది. ఈ సంవత్సరము మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనతో పాటు, శని ధ్యానము అలాగే గణపతి ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి.
