NTV Telugu Site icon

Viral Video: తుఫాన్ గాలికి కొట్టుకుపోతున్న విమానం..

Plane

Plane

అర్జెంటీనాను అతలాకుతలం చేసిన తుఫాను కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అర్జెంటీనాలో గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ గాలుల బారి నుంచి విమానాలు సైతం తప్పించుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న ఓ విమానం బలమైన గాలులు వీయడంతో 90 డిగ్రీల మలుపు తిరిగి అక్కడ నిలబడి ఉన్న మెట్లను ఢీకొట్టింది.

Read Also: Parliament Sessions: పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..?

ఇక, విమానం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జ్ న్యూబెరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి ఉంది. అయితే, బలమైన గాలులు రావడంతో సిబ్బంది విమానాలను ఎయిర్ పోర్టులో నిలిపి ఉంచారు. కానీ, ఒక్కసారిగా భారీ ఎత్తున గాలులు రావడంతో ఆ విమానాన్ని రక్షించుకోలేకపోయారు. గాలి తీవ్రత పెరగడంతో విమానం కూడా విమానాశ్రయంలో 90 డిగ్రీలు మలుపు తిరిగింది. ఈ సమయంలో విమానానికి మెట్లు కూడా ఉన్నాయి. విమానం ఢీకొనడంతో మెట్లు కింద పడిపోవడంతో విమానం వెనకాల భాగం కొద్దీగా దెబ్బతింది.

Read Also: IPL 2024 Auction: నాకు అంత ధరా.. షాక్‌కు గురయ్యాను: మిచెల్‌ స్టార్క్‌

అయితే, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జెంటీనాలో తీవ్రమైన తుఫాన్ కారణంగా 16 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఈ తుఫాన్ మొదటి సారిగా డిసెంబర్ 16న బ్యూనస్ ఎయిర్స్‌కు దక్షిణంగా 570 కిలో మీటర్ల (355 మైళ్ళు) దూరంలో ఉన్న ఓడరేవు నగరం బహియా బ్లాంకాలో ల్యాండ్‌ ఫాల్ చేసింది. దీంతో భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.