కొంతమందిలో పడుకున్నప్పుడు గురక అనేది వస్తుంది. దాని వల్ల వారు బాగానే పడుకున్నా.. ఎదుటి వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతారు. గురక అనేది శ్వాసలో ఇబ్బంది వల్ల వస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ బరువున్న వాళ్లు, చెడు జీవనశైలి, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వాళ్లకు గురక వస్తుంది. అయితే గురక సమస్యతో పోరాడుతున్నట్లయితే.. ఈ సింపుల్ హోం రెమెడీస్ వల్ల ఆ సమస్య నుండి బయటపడచ్చు.
రోజూ రాత్రిపూట పసుపు పాలు తాగితే గురక సమస్యను పరిష్కరించుకోవచ్చు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది స్వర తంతువులు, గొంతు వాపును తగ్గించడం ద్వారా ఉపశమనాన్ని అందించి గురకను నివారిస్తుంది.
Read Also: Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
వెల్లుల్లి
మీరు వెల్లుల్లి వాడటం వల్ల గురక సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం రాత్రిపూట ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచాలి. ఆ తర్వాత నెయ్యిలో వేయించి మందులా తినాలి.
తేనె, దాల్చినచెక్క
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే గురక సమస్య అదుపులో ఉంటుంది. వరుసగా కొన్ని రోజులు రాత్రి పడుకునే ముందు ఈ రసాన్ని తాగితే.. గురక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
ఆలివ్ నూనె
గురకను నియంత్రించడానికి ఆలివ్ ఆయిల్ చాలా ప్రభావవంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. గురకను ఆపడానికి ఆలివ్ నూనె కూడా సహాయపడుతుంది. ఒక చెంచా ఆలివ్ నూనెను వేడి చేసి చల్లబరచి.. రాత్రి పడుకునే ముందు ముక్కులో కొన్ని చుక్కలు వేసుకోవాలి. దాని వల్ల గురక సమస్య బారి నుండి బయటపడవచ్చు.
పుదీనా
పుదీనా ఆకులను ఉడకబెట్టి నీటిలో వేసి, కొన్ని చుక్కల పుదీనా నూనెను ముక్కులో వేసుకోవడం వల్ల కూడా గురక నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇవే కాకుండా.. శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా గురక నుండి ఉపశమనాన్ని అందించడంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయి. ప్రాణాయామం, అనులోం-విలోమ్, కపాలభాతి వంటి యోగాసనాలు వేయడం ద్వారా గురక సమస్య నయమవుతుంది.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..