ఆకలి శరీరంలో జరిగే ఓ సాధారణ ప్రక్రియ. శరీరానికి శక్తి అందాలంటే ఆహారం తప్పనిసరి.. రుచితో పాటు ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. కొందరికి తిన్న వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. ఇలా అవ్వడానికి ఆరోగ్య సమస్యలే కారణమని వైద్యులు చెబుతున్నారు. అలా అవుతున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పలు రకాల సూత్రాలు పాటించాలి. సాధారణంగా రోజుకు 3-4 సార్లు ఆహారం తీసుకుంటుంటారు. ఆరోగ్యకరమైన శరీరానికి ఆహారం అవసరం. ఆహారం శరీరానికి ఇంధనం. కొందరు రోజుకు సార్లు తిన్న వెంటనే ఆకలిగా అనిపిస్తుందని చెబుతుంటారు. ఈ అనుభూతి మీకు కూడా అనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. ఇలా అవ్వడానికి కారణాలేమిటో చూద్దాం..
READ MORE:T20 World Cup 2024: వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ టీం రెడీ.. టీంను ప్రకటించిన ఈసీబీ..
మందుల వల్ల ఈ రకమైన అనుభూతి రావొచ్చు. మందులు వేర్వేరు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. కొన్ని మందులు ఆకలిని పెంచుతాయి. కొన్ని యాంటిసైకోటిక్ మందులు, కొన్ని యాంటిహిస్టామైన్లు, స్టెరాయిడ్లు ఆకలిని పెంచుతాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది మీకు ఆకలిగా అనిపించకుండా సహాయపడుతుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలితో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు రాత్రిపూట తగినంత నిద్రపోకపోతే, అది మీ శరీరం, మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కూడా ఆకలి పెరగడానికి ఓ కారణమవుతోంది.
మనం ఏదో ఒక పనిచేస్తుంటాం. మనం చేసే పనివల్ల శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, ఉద్రిక్తత పెరిగినప్పుడు, మీ శరీరంలోని హార్మోన్ స్థాయిలు మారుతాయి. ఇది కూడా ఓ కారణమవుతోంది. ప్రస్తుతం వయసులతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య మధుమేహం. ఈ వ్యధి ఉన్న వారికి ఆకలి ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహంతో పాటు హైపోగ్లైసీమియా, హైపర్ థైరాయిడిజం, గ్రేవ్స్ వ్యాధి, నిరాశ, ఆందోళన వంటివి ఆకలిని పెంచుతాయి. కొన్ని సెక్స్ హార్మోన్లలో మార్పులు మీ ఆకలిని పెంచుతాయి. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల ఆకలి పెరుగుతుంది. తక్కువ స్థాయిలో ప్రొజెస్టెరాన్ కూడా ఆకలిని కలిగిస్తుంది. అలాగే మీ పీరియడ్స్ మొదటి కొన్ని రోజుల్లో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది. ఇలా పలు రకాల కారణాల వల్ల తిన్న వెంటనే ఆకలిగా అనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.