Site icon NTV Telugu

Unknown Calls: గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా?.. ఇలా సింపుల్‌గా బ్లాక్ చేయండి

Unknown Calls

Unknown Calls

Unknown Calls: సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సాప్‌ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది వాట్సాప్ యూజర్లకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ కాల్స్ ద్వారా కొంతమంది అమాయకులను సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్‌ కొనుగోలుతో ఇతర దేశాల నుంచి ఫోన్ వస్తున్నట్లు భ్రమలు కలిగిస్తున్నారు. దీంతో వర్క్‌ ఫ్రం హోం అని ఆశ చూపుతూ అకౌంట్లలో ఉన్న డబ్బులను దండుకుంటున్నారు. ఇలాంటి ఫోన్స్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది ఇలాంటి స్కామ్స్‌ బారిన పడుతున్నారు. స్కామ్ మాత్రమే కాదు దీని వల్ల గోప్యత, భద్రతా సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ నెంబర్ల నుంచి స్కామ్ కాల్స్ విషయానికి వస్తే కాలర్స్ లేదా హ్యాకర్స్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు పలు రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. వ్యక్తుల వ్యక్తిగత డేటా, ఆర్థిక వివరాలు లేదా రహస్య సమాచారం తెలుసుకోవడానికే సైబర్‌ నేరగాళ్లు కాల్స్ చేస్తుంటారు. ఈ కాలర్స్‌తో మాట్లాడితే మీ వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మీ బ్యాంకు ఖాతాలు కాల్ చేస్తుంటారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తెలియని కాలర్స్‌తో వివరాలు పంచుకోకూడదు.

Also Read: E-Schooter: వినియోగదారులకు షాక్.. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.10 వేలు పెరిగిందోచ్..

ముఖ్యంగా ఇతర దేశాల నుంచి కాల్‌ చేస్తున్నట్లు వ్యవహరించే వారితో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తుంటే, అలాంటి కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు, ఐఫోన్ యూజర్లు ఏం చేయాలో తెలుసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చడానికి ముందుగా ఫోన్ యాప్ ఓపెన్ చేయాలి. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీడాట్స్ పైన క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. కాల్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. బ్లాక్ నెంబర్స్ పైన క్లిక్ చేయాలి. Unknown ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఐఫోన్‌లో సెట్టింగ్స్ మార్చడానికి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఫోన్ పైన క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. Silence Unknown Callers పైన క్లిక్ చేయాలి. ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఈ సెట్టింగ్స్‌తో మీకు గుర్తుతెలియని వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తే మీ ఫోన్ రింగ్ కాదు. అయితే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందన్న వివరాలు కాల్ లిస్ట్‌లో చూడొచ్చు. ఈ సెట్టింగ్స్ మాత్రమే కాకుండా తెలియని నంబర్‌ల నుండి కాల్స్ బ్లాక్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ కాల్ బ్లాకింగ్ యాప్‌ను ఉపయోగించవచ్చు. యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్‌లో పలు కాల్ బ్లాకింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు వాటి రివ్యూస్ చదవాలి

Exit mobile version