NTV Telugu Site icon

Replacing phone: మీ ఫోన్లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయా.? అయితే కొత్త ఫోన్ కొనాల్సిందే..

Mobile

Mobile

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అవసరం. చదువుకునే పిల్లల నుంచి ఇంట్లో కాలక్షేపం చేసే వృద్ధుల వరకు అందరికీ ఫోన్ ఉండాల్సిందే. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోన్ల ఫీచర్లలో కూడా మార్పులు వస్తున్నాయి. కొందరికి కొత్త ఫోన్ కొనాలని ఉన్నా.. ఏళ్ల కిందట కొన్న ఫోన్ బాగానే ఉంది కదా అనుకొని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. కాని మీఫోన్ ను రీప్లేస్ చేయమని ఫోన్లోని కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Kishan Reddy: రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు..

ఏళ్ల కిందట కొన్న ఫోన్ కాబట్టి క్రమంగా దాని పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అప్పుడు మీకు కొత్త ఫోన్ కొనాల్సిన సమయం వచ్చిందని అనుకోవాలి. కొత్త అప్ డేట్స్ ను, కొత్త ఫీచర్స్ ను ఉపయోగించలేకపోతున్నట్లయితే, కొత్త ఫోన్ కు మారడం బెటర్. యాప్స్ ఓపెన్ చేయడం లేట్ అవుతున్నా, ఫోన్ ల్యాగ్ అవుతున్నా.. ఫోన్ మార్చాలి. అంతే కాదు.. సెక్యూరిటీ పరంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కంపెనీ ఇచ్చిన బ్యాటరీల జీవితకాలం తక్కువగానే ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ తొందరగా డ్రెయిన్ అవుతున్నా, ఫుల్ చార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడుతున్నా.. మీ బ్యాటరీ లైఫ్ అయిపోయిందని అర్థం. మీ యాప్స్ తరచుగా క్రాష్ అవుతుంటే, లేదా మీ స్క్రీన్ తరచూ ఫ్రీజ్ అవుతూ ఉంటే, మీ ఫోన్ హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్ లో ఏదైనా లోపం ఉండవచ్చు. పాత మోడల్ స్మార్ట్ ఫోన్స్ కు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ఇవ్వడం నిలిపేస్తారు. దీనివల్ల మీ ఫోన్ సెక్యూరిటీ ప్రమాదంలో పడుతుంది. బ్యాంకింగ్ యాప్స్ ను వాడడంలో భద్రత సమస్య తలెత్తుతుంది. మీ ఫోన్ కు కొంతకాలంగా సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ రాకపోతే, కొత్త ఫోన్ కు మారడానికి సమయం వచ్చిందని అర్థం. స్క్రాచ్ లు మరియు పగుళ్లు మీ ఫోన్ ఎలా పనిచేస్తుందో ప్రభావితం చేయకపోవచ్చు, కానీ అవి కాలక్రమేణా పెరుగుతాయి. మీ ఫోన్ కు తీవ్రమైన డ్యామేజ్ ఉంటే, దాన్ని సరిచేయడం కంటే కొత్తది పొందడం చౌక కావచ్చు. పైన తెలిపిన అంశాలు మీ ఫోన్ల ద్వారా మీకు ఎదురైతే.. ఇంకేంటి ఆలస్యం కొత్తఫోన్ కొనేయండి.