Site icon NTV Telugu

Kothapalli Geetha: ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి..

Kothapalli Getha

Kothapalli Getha

అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో మాదిగలంతా కలిసి సంపూర్ణ మద్దతును అందించి పార్లమెంట్ సభ్యురాలిగా గెలిపిస్తామని ఎమ్మార్పీఎస్ ఉత్తర కోస్తాంద్ర అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు తెలిపారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీయే కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోడీ సహకారంతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయగలిగే సమర్ధత గల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు అరకు నియోజకవర్గం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించాలన్నారు. మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాలలో ప్రచారంలో చేసి.. అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. యువ నాయకుడు చినబాబు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు.

Read Also: Bihar : రెస్టారెంట్ బాత్‌రూమ్‌లో సీక్రెట్ డోర్.. గంటకు రూ.వెయ్యి చార్జీ

ఇక, ఈ సమావేశంలో అరకు ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ నాయకులంతా కలిసి కూటమికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ప్రచారం చేయడం అభినందనీయం అన్నారు. ఇప్పటికే మందకృష్ణ మాదిగ, ప్రధాని మోడీని కలిసి సంఘీభావం తెలిపారన్నారు. అరకు పార్లమెంట్ లో కూడా మాదిగ సోదరులు మాకు మద్దతు తెలపటం అనందంగా ఉందన్నారు. దేశంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అందరు ఓట్లు వేయాలని కొత్తపల్లి గీత కోరారు.

Exit mobile version