Aishwarya Rai : ఇండియాలో నేడు నంబర్ వన్ కుబేరుడు అనిపించుకుంటున్న ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తన పేరిట ముంబైలోని బాంద్రాలో ఆరంభించిన కల్చరల్ సెంటర్ కు పలువురు తారలు దిగివచ్చారు. ఇండియాలో టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న రజనీకాంత్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్ వంటి వారు పాల్గొన్నారు. అయితే వీరందరికన్నా మిన్నగా హాలీవుడ్ స్టార్స్ టామ్ హాలాండ్, జెండాయా, జిగి హాడిడ్, పెనెలోప్ క్రజ్ వంటివారు కూడా పాల్గొని అలరించడమే విశేషం! సోమవారం ఉదయం హాలీవుడ్ తారలు ముంబైకి బై బై చెప్పేసి వెళ్ళారు. కానీ, ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారిలో చాలామంది హాలీవుడ్ భామలనే తలచుకుంటూ ఉండడం విశేషం!
Read Also: NTR – Jayaprada : యన్టీఆర్ – జయప్రద మధ్య ఏం జరిగింది!?
కాగా, ఈ వేడుకలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన పదకొండేళ్ళ కూతురు ఆరాధ్యతో పాలుపంచుకున్నారు. ఆరాధ్య ఇంత వయసులోనే తల్లి భుజాలపైగా ఎత్తులో ఉంది. ఎంతయినా జీన్స్ కదా! ఆమె తాత అమితాబ్ బచ్చన్, తండ్రి అభిషేక్ బచ్చన్ ఇద్దరూ పొడగరులే! ఆమె ముఖంలో అందాలభామ ఐశ్వర్యారాయ్ పోలికల కన్నా అభిషేక్ ముఖకవళికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేనిఛాయ కూడా ఐశ్వర్య స్థాయిలో లేదనే చెప్పాలి. అయినా, కొందరు బచ్చన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆమెను ఆసక్తిగా చూశారు. సినిమాలంటే ఇష్టమేనని, అయితే సినిమాలలో నటించడంపై అంతగా ఆసక్తి లేదని కొందరికి ఆరాధ్య చెప్పిందట! తన తల్లి కీలక పాత్ర పోషించిన మణిరత్నం సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ ఆరాధ్య అందట! చిన్నవయసులోనే కవితలు అల్లడం నేర్చిందట ఆరాధ్య. మరి, తాతయ్య-నాన్నమ్మ, తల్లిదండ్రుల బాటలో నటిగా మారుతుందో లేక ముత్తాత హరివంశరాయ్ బచ్చన్ లా కవిత్వంలో రాణిస్తుందో చూడాలి.
Read Also: Prabhu Deva : ప్రజ్ఞాశాలి… ప్రభుదేవ!
