Site icon NTV Telugu

AR Rahman – Prabhu Deva : ఎన్నో ఏళ్ల తరువాత మరోసారి కలవబోతున్న క్రేజీ కాంబో..

Whatsapp Image 2024 03 22 At 10.25.29 Pm

Whatsapp Image 2024 03 22 At 10.25.29 Pm

ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభు దేవా, ఆస్కార్ విన్నర్ రెహమాన్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో 1990ల్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.. వీరిద్దరూ కలిసి తొలిసారి 1993లో జెంటిల్మేన్ మూవీ చేశారు. అందులోని చికు బుకు చికు బుకు రైలే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ తర్వాత వీరి కాంబోలో ప్రేమికుడు మూవీ వచ్చింది.ఇందులో ప్రభుదేవానే పూర్తిస్థాయి హీరోగా ఉన్నాడు.అందులోని ఊర్వశి, ఓ చెలియా సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆ తర్వాత లవ్ బర్డ్స్, మిస్టర్ రోమియో మరియు మెరుపు కలలులాంటి సినిమాలు చేశారు. ఈ మూవీస్ లోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మెరుపు కలలులోని వెన్నెలవే పాట, అందులో ప్రభుదేవా స్టెప్స్ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు..

ఇదిలా ఉంటే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరోసారి ఈ సూపర్ కాంబినేషన్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.”ఏఆర్ఆర్‌పీడీ6” పేరుతో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ మనోజ్ ఎంఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యోగి బాబు, వర్గీస్, అర్జున్ అశోకన్, డాక్టర్ సంతోష్ జాకబ్, సుష్మితా నాయక్ మరియు మొట్టా రాజేంద్రన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను శుక్రవారం (మార్చి 22) లాంచ్ చేశారు. ఇందులో ఆల్ టైమ్ హిట్ సాంగ్ ముక్కాలా ముకాబులా సాంగ్ లో ప్రభుదేవా స్టెప్ కు సంబంధించిన ఫొటోతోపాటు బ్యాక్‌గ్రౌండ్ లో రెహమాన్ పాడుతున్న పిక్చర్ ను కూడా ఉంచారు. ఈ కొత్త సినిమాను బిహైండ్‌వుడ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ అనూప్ శైలజ మరియు ఎడిటర్ రేమాండ్ డెరిక్ ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు.

Exit mobile version