Site icon NTV Telugu

Aqib Javed: “బుమ్రా ఫాస్ట్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ లాంటోడు”.. పాకిస్థాన్ సెలక్టర్ వింత వాదన..

Aqib Javed

Aqib Javed

Aqib Javed: టీమిండియాకు బుమ్రా ఓ వరం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ వేయడం దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాదు.. భారత ఆటగాళ్లే కాదు.. విదేశీ సీనియర్ ప్లేయర్స్ సైతం బూమ్ర బౌలింగ్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ తరుణంలో పాకిస్థాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వింత వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జస్ప్రీత్ బుమ్రాను పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌తో పోచ్చాడు జావేద్.. “బుమ్రా సాధారణ బౌలర్ కాదు, ఫాస్ట్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ లాంటి వాడు” అని అభివర్ణించడం పెద్ద దుమారం రేపింది.. టీ20 వరల్డ్ కప్పు 2026లో బుమ్రా ఫార్ఫామెన్స్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఇలాంటి కీలక బౌలర్‌ను పాకిస్థాన్ స్పిన్నర్‌తో పోల్చడం విచిత్రంగా ఉంది.

READ MORE: Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి

ఉస్మాన్ తారిక్ ఈ వరల్డ్ కప్పు సీజన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌కు గురయ్యాడు. దీనికి ప్రధార కారణం వింతైన బౌలింగ్ యాక్షన్. బాల్ విసిరే ముందు కొంత టైమ్ ఆగి వేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే.. బుమ్రా స్టైల్‌ సైతం పూర్తి భిన్నంగా ఉంటుందని జావేద్ అభివర్ణించాడు. బుమ్రా కూడా తన విలక్షణమైన యాక్షన్, వేగం, వైవిధ్యంతో బ్యాటర్ల రిథమ్‌ను దెబ్బతీస్తారని ఆకిబ్ జావేద్ విశ్లేషించాడు. ఆధునిక క్రికెట్‌లో వసీం అక్రమ్ లేదా వకార్ యూనిస్ వంటి స్థాయి దిగ్గజాలు కనిపించడం లేదని, ప్రస్తుతం బుమ్రా ఒక్కడే అత్యంత ప్రభావవంతమైన, విభిన్నమైన బౌలర్‌గా కనిపిస్తున్నాడని కొనియాడాడు.

READ MORE: Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..

అంతర్జాతీయ క్రికెట్లో మెరుపువేగంతో బంతులువేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లను అనేకమంది చూశాం. బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్లు పడగొట్టే వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను చూశాం. కానీ వీడెవడండీ బాబు… ఇలా బౌలింగ్ చేస్తున్నాడు…! అని అనిపిస్తుంటుంది పాకిస్థాన్ ప్లేయర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చూస్తుంటే. ఈ టీ20 వరల్డ్ కప్ సీజన్‌లో ఈ పాకిస్థానీ బౌలింగ్ పై తీవ్ర చర్చలు సాగాయి. అతడి యాక్షన్ ను చాలామంది వ్యక్తిరేకిస్తున్నారు. ఇలాంటి స్పిన్నర్‌ను బుమ్రాతో పోల్చడం ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Exit mobile version