NTV Telugu Site icon

APR 5K Run : ఏపీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 5కే రన్

5k Run

5k Run

ఏపీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఏపీఆర్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌లో భారీగా కాలనీవాసులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఏపీఆర్ భవన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించారు. దీనికి ముందు ఆటల పాటలతో నృత్యాలతో 5 కే రన్ లో పాల్గొన్న కాలనీ వాసులు అలరించారు. అలాగే ఇందులో వయసుల వారీగా గెలిచిన వారికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మె్ల్యే మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు.

విద్యార్థుల్లో కూడా క్రీడా స్ఫూర్తి నింపాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఉందని ఆయన చెప్పారు. పిల్లల క్రీడల ద్వారా ఆరోగ్యంగా ఉంటే పెద్దల వ్యాయామం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఏపీ నిర్మాణ సంస్థ నిర్మించిన మోడల్ ప్లాట్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి , డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సంజీవ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.