NTV Telugu Site icon

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు

Appsc

Appsc

APPSC: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షణు పాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయన్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది ఏపీపీఎస్సీ. ఇటీవల ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే నోటిఫికేషన్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Read Also: END of Ola and Uber?: ‘బ్లూ స్మార్ట్‌’ వచ్చేసింది.. ఓలా, ఉబర్‌లు బందేనా?

గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు 2023 మార్చి 15 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి వెబ్ నోట్ ను రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 అడ్మిట్ కార్డులను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడగా.. మెయిన్స్ పరీక్షల తేదీల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరీక్షలు ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించే ఛాన్స్ ఉంది. గ్రూప్ 1తో పాటు.. ఇటీవల రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలకు psc.ap.gov.inను సందర్శించవచ్చు.

Show comments