Site icon NTV Telugu

Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా..

Gautam Sawang

Gautam Sawang

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. ఇవాళ సాయంత్రం గవర్నరును కలిసి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో.. గవర్నర్ సవాంగ్ రాజీనామాను ఆమోదించారు. కాగా.. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని సవాంగ్ పై ఆరోపణలు వచ్చాయి. సవాంగ్ వైసీపీ హయాంలో డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. అయితే.. సవాంగ్ పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కాగా.. తాజాగా రాజీనామా చేశారు.

Exit mobile version