కానిస్టేబుల్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా ఏడు వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులకు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి 7,565 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామక డ్రైవ్‌లో మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన పోస్టులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Also Read:CM Revanth: 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి.. వారి సంప్రదాయాలు, విశ్వాసాల మేరకే ఆలయ నిర్మాణం!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఆ తర్వాత శారీరక సామర్థ్యం, మెజర్ మెంట్ టెస్ట్ (PE & MT) ఉంటాయి. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 100 చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, SC, ST, మాజీ సైనికులకు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 21 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
