ఏజ్ ఎక్కువైపోయింది.. ఇక గవర్నమెంట్ జాబ్ సాధించలేనేమో అని వర్రీ అవుతున్నారా? మీ లాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన RITES (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్) లిమిటెడ్ 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read:Uttar Pradesh Shocker: లక్ష రూపాయల కోసం.. కన్నకొడుకునే.. మాస్టర్ బ్రెయిన్ తల్లి నీది…
అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/మెకానికల్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో డిప్లొమా లేదా సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉన్న కెమిస్ట్రీలో బి.ఎస్సీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 40 ఏళ్లుగా నిర్ణయించారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 29,735 జీతం లభిస్తుంది.
Also Read:Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 12 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష నవంబర్ 23న నిర్వహిస్తారు. ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి, జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 300 దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో సమర్పించాలి. EWS/SC/ST/PWD అభ్యర్థులకు, రుసుము రూ. 100. మరిన్ని వివరాల కోసం, RITES లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
