పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన రిలేషన్‌షిప్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో పూర్తి సమయం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. మార్కెటింగ్ లేదా ఫైనాన్స్‌లో MBA ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా, దరఖాస్తుదారులు MSME బ్యాంకింగ్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
Also Read:Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!
వయోపరిమితి మే 1, 2025 నాటికి 25, 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, స్క్రీనింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాలి. వారి మిశ్రమ స్కోర్‌ల ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు. దరఖాస్తు ఫీజు SC/ST/PWD అభ్యర్థులు రూ. 100 + GST + చెల్లించాలి. జనరల్/ఇడబ్ల్యుఎస్/ఓబిసి అభ్యర్థులు రూ. 850 + జిఎస్టి + చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 18 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
