ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడమంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలల్లో అసాధారణ ప్రతిభ చూపితే గాని కొలువు చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 40 పోస్టలను భర్తీ చేయనున్నారు. NHAI తన అధికారిక వెబ్‌సైట్ nhai.gov.inలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది.
Also Read:Akhanda 2 Vs MSVG: ‘అఖండ 2’ ఫుల్ రన్ ప్రీమియర్స్’తో కొట్టిన శంకర వరప్రసాద్ గారు!
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్‌కార్డ్‌ను కూడా కలిగి ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉన్నాయి. గేట్ 2025 స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు. నెలకు లెవల్ 10 (56100-1,77,500) వరకు శాలరీ అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 9 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
