మంచి వేతనం.. లైఫ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఈ జాబ్స్ ను వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మేనేజర్ – సేల్స్, ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ రోల్ లో ఖాళీలు ఉంటాయి. ఈ నియామక డ్రైవ్‌లో MMG/S-II స్కేల్‌లో మేనేజర్ – సేల్స్ కోసం 227 పోస్టులు, ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్ కోసం 142 పోస్టులు, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ కోసం 48 పోస్టులు భర్తీకానున్నాయి.
Also Read:Ranveer Singh : అభిమాని పట్ల.. రణ్‌వీర్ సింగ్ చేసిన పనికి షాక్ అయిన నెటిజన్లు!
అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యేయేషన్, కొన్ని పోస్టులకు అగ్రికల్చర్ డిగ్రీ కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 24 నుంచి 42 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎంపిక విధానంలో ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష , వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులందరూ చేరిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో పిరియడ్ లో ఉంటారు. ఎంపికైన వారికి ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్ నెలవారీ జీతం స్కేల్ రూ.48,480- రూ.85,920 మధ్య ఉంటుంది.
Also Read:Tollywood : ప్రొడ్యూసర్స్ మీద దాడి చేస్తే తాట తీస్తాం : సి. కళ్యాణ్
మేనేజర్ – సేల్స్, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ పోస్టులకు, అనుభవం బట్టి నెలవారీ జీతం రూ.64,820- రూ.93,960 మధ్య ఉంటుంది. జనరల్, EWS, OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 850, SC, ST, PwD, ESM/DESM వర్గాలకు చెందిన అభ్యర్థులకు, మహిళా దరఖాస్తుదారులకు ఫీజు రూ. 175 చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6, 2025న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 26, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
