Site icon NTV Telugu

SBI Clerk Recruitment 2025: ఎస్బీఐలో 6,589 క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

Sbi

Sbi

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. భారీగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. ఏకంగా 6,589 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలలో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు డిసెంబర్ 31, 2025 లోపు డిగ్రీని పొందాలి.

Also Read:Pulivendula Violence: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణుల దాడి.. ఒకరి పరిస్థితి విషమం

దరఖాస్తుదారులు ఏప్రిల్ 1, 2025 నాటికి 20- 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. (ఏప్రిల్ 2, 1997, ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించి ఉండాలి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ టెస్ట్, లాంగ్వేజ్ ఎఫిషియెన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. టైర్ 1 ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2025 లో, టైర్ 2 మెయిన్స్ పరీక్ష నవంబర్ 2025 లో జరుగుతుంది.

Also Read:Bollywood : షాహీద్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్.. మధ్యలో ప్రభాస్.. గెలుపెవరిది

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతం లభిస్తుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ వర్గాలకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే ఆగస్ట్ 06 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 26 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version