పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ అయ్యే అవకాశాన్ని వదులుకోకండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ను స్పోర్ట్స్ కోటా కింద నిర్వహిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 391 కానిస్టేబుల్ (GD) పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, గత రెండు సంవత్సరాలలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రీడలో ప్రాతినిధ్యం వహించి లేదా పతకం గెలుచుకుని ఉండాలి.
Also Read:RTA Special Drive in AP: ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. ఏపీలో భారీగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్..
దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు జీతం అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు జనరల్, OBC పురుష అభ్యర్థులకు రూ. 159 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 4, 2025 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
