Site icon NTV Telugu

AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జాబ్స్.. భారీ శాలరీ

Job

Job

ఎయిర్‌పోర్ట్ లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న యువతకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/రేడియో ఇంజనీరింగ్‌లో డిప్లొమా, సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (HR) పోస్టుకు గ్రాడ్యుయేషన్ అవసరం.

Also Read:MLA Madhavaram: IDPL ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ సర్కార్..

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టుకు, 10వ తరగతి డిగ్రీ, మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్‌లో మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా ఉన్నవారు, 12వ తరగతి రెగ్యులర్ స్టడీస్‌లో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ లిటరసీ పరీక్ష కూడా నిర్వహిస్తారు. సీనియర్ అసిస్టెంట్ నెలకు రూ. 36,000-1,10,000 వరకు జీతం పొందుతారు. జూనియర్ అసిస్టెంట్ నెలకు రూ. 31,000-92,000 వరకు జీతం పొందుతారు. 06/12/2025 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read:GHMC :జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో వార్డుల పునర్విభజనపై రచ్చ

రిజర్వ్డ్ కేటగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. జనరల్/ఇడబ్ల్యుఎస్, ఓబిసి అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుబిడి/మాజీ సైనికులకు, AAIలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 జనవరి 2026. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version